ప్రధాని మోడీ పక్కన.. అద్వానీ కాదు!!

4న్యూఢిల్లీ : పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన రోజున ప్రధాని నరేంద్రమోడీ పక్కనే బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ కూర్చున్నారు. కానీ రెండో రోజు.. గురువారం మాత్రం ఆయన అలా కూర్చోలేదు. ఆయనకు బదులు మొదటి వరుసలో వరుసగా కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్, రాజ్నాథ్ సింగ్, రాం విలాస్ పాశ్వాన్ కూర్చున్నారు.

వాస్తవానికి తనను రెండో వరుసలో కూర్చోనివ్వాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడుతో అద్వానీ చెప్పడం కనిపించింది. అయితే, ఆయన మాత్రం అందుకు నిరాకరించి, మీరు మొదటి వరుసలోనే కూర్చోవాలని కోరడంతో అద్వానీ మొదటి వరుసలో కూర్చున్నారు. కానీ ప్రధాని పక్కన మాత్రం కూర్చోలేదు! ఇక బ్యాక్బెంచ్ అబ్బాయి రాహుల్ గాంధీ రెండో రోజు కూడా వెనకాలే కూర్చుని, ఎన్సీపీ ఎంపీ, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేతో చాలా సుదీర్ఘంగా ముచ్చటించడం గురువారం నాటి విశేషం.

Leave a Comment