ప్రముఖ సంగీత విద్వాంసుడు పద్మ విభూషణ్ డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ చెన్నైలోని తన స్వగృహంలో తన 86వ ఏట అస్వస్థతతో బాధపడుతు మరణించారు.మాతృభాష అయిన తెలుగుతో పాటు సంస్కృతం, కన్నడ, తమిళ భాషల్లో కలిపి దాదాపు 400కు పైగా కర్ణాటక సంగీత బాణీల్లో కృతులు, వర్ణాలు, జావళులు, తిల్లానలు రచించిన బాలమురళి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు అందుకున్నారు.
జాతీయ స్థాయిలో పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ తదితర అత్యున్నత పురస్కారాలుతో పాటు 2005లో ఫ్రెంచి ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక షెవాలియర్ గౌరవాన్ని పొందారు.
తన జీవితకాలంలో 25వేలకు పైగా సంగీత కచేరీలు నిర్వహించిన బాలమురళీకృష్ణ, అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, శ్రీలంక మరియు ఖండాంతరాలు లో కచేరీలు చేసి కర్ణాటక సంగీత ఘనతను చాటి చెప్పారు.
Recent Comments