ప్రస్తుతం ఒంటరినే..!

Nargis Fakhriపాక్ సంతతికి చెందిన కెనడా బ్యూటీ నర్గిస్ ఫక్రీ, ఉదయ్ చోప్రా మధ్య ఏదో ఉందంటూ చాలా కాలంగా పుకార్లు వినిపిస్తుండడం తెలిసిందే. నర్గిస్ మాత్రం ఇలాంటిదేం లేదంటోంది. ప్రస్తుతం తాను ఒంటరిదాన్నేనని చెబుతోంది. ఇద్దరి మధ్య ట్విటర్‌లో జరిగిన సంభాషణపై అనుమానాలు రావడం గురించి స్పందించింది. ‘ఉదయ్ సరదా మనిషి. ఎప్పుడూ ఎవరో ఒకరిపై జోకులు వేస్తుంటాడు. నేను అలాంటివి పట్టించుకోను. నాకు హీరోలందరితో సంబంధాలు ఉన్నాయన్నారు. నిజం నా ఒక్కదానికే తెలుసు. నేను ఒంటరి దానినన్నదే నిజం. ఉదయ్ ట్వీట్లపై వచ్చిన వార్తలు చూసి నవ్వుకున్నాను. అతడు నన్ను అప్పుడప్పుడు ఆట పట్టిస్తుంటాడు.
 
 ఎవరికీ హాని చేసే మనిషి కాదు అతడు’ అని ఈ 34 ఏళ్ల బ్యూటీ చెప్పింది. ఉదయ్ ఇటీవల ట్విటర్‌లో ఒక ఫొటో పోస్టు చేశాడు. అందులో మనోడు ఒక మగ్ పట్టుకొని ఉండగా, దానిపై నర్గిస్ చిత్రం ఉంది. ‘ఎవరు ఈమె ? నాకు ఈమెతో సంబంధం ఉందని అందరూ అంటున్నారు! అసలు నర్గిస్ గురించి ఎప్పుడూ వినలేదు’ అంటూ రాశాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందంటూ పుకార్లు మొదలయ్యాయి. వెరో మోడా అనే వస్త్ర దుకాణాన్ని ప్రారంభించడానికి మంగళవారం ఢిల్లీ వచ్చిన నర్గిస్ ఫక్రీ స్కర్ట్, టాప్‌లో తళుక్కున మెరిసింది. దుస్తుల శైలి గురించి మాట్లాడుతూ గతంలోనూ తాను మోడల్‌ను కాబట్టి అన్ని రకాలవి ధరించడం ఇష్టమని, బికినీకి కూడా అభ్యంతరం ఏమీ లేదని చెప్పింది.  బాలీవుడ్ హీరోయిన్లలో ఎవరి దుస్తులు బాగుంటాయన్న ప్రశ్నకు బదులుగా.. దీపికా పదుకొణే, సోనమ్ కపూర్ అని తెలిపింది. ఇదిలా ఉంటే నర్గిస్‌కు స్పై అనే హాలీవుడ్ సినిమాలో అవకాశం దక్కింది. ఇది వచ్చే ఏడాది మేలో విడుదలవుతుంది.

Leave a Comment