ప్రీతి జింటా, వాడియా.. మధ్యలో మాఫియా

priety zintaముంబై: మాజీ ప్రేమికులు, కింగ్స్ లెవెన్ పంజాబ్ సహ భాగస్వాములు ప్రీతి జింటా, నెస్ వాడియాల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. నెస్ వాడియా తనను దుర్భాషలాడి, చేయి చేసుకున్నాడని బాలీవుడ్ భామ ప్రీతి చేసిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరుపుతుండగా.. తాజాగా నెస్ వాడియా కుటుంబం తమకు మాఫియా నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నెస్ వాడియా తనను లైంగికంగా వేధించాడని ప్రీతి ఫిర్యాదు చేసినట్టు తొలుత వార్తలు రాగా, ఆ తర్వాత ఆమె వీటిని ఖండించారు. వీరిద్దరూ గొడవపడిన సమయంలో ఓ క్రికెటర్ కొడుకు ఉన్నాడని, ఈ కేసులో అతడిని సాక్షిగా చేర్చే విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కేసు విచారణ సాగుతుండగానే.. నెస్ వాడియా కుటుంబం పోలీసులను ఆశ్రయించింది.

Leave a Comment