ఫలితాల తరువాత తెలంగాణపై మాట్లాడిన సోనియా

3ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సందర్భంగా  ప్రజలకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఆమె మొదటిసారిగా తెలంగాణ గురించి మాట్లాడారు. తెలంగాణ పోరాటానికి సుదీర్ఘ చరిత్ర ఉందని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షను నెరవేర్చాలని 2013లో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ ప్రజల కలను సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌,  తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ  నిబద్దతతో పని చేస్తుందని సోనియా గాంధీ చెప్పారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ ఏర్పడటం కాంగ్రెస్ పుణ్యమేనని కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని చెప్పారు.

Leave a Comment