ఫేస్‌బుక్‌లో ప్రేమ, పెళ్లి: కుటుంబ సభ్యుల కేసు

01-bhubaneswar-600భువనేశ్వర్: పాకిస్తాన్‌కు చెందిన ఓ యువకుడిని ప్రేమించి, పెళ్లి చేసుకున్న యువతి పైన తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా.. తన కూతురు అదృశ్యమైందంటూ కేసు పెట్టారు. ప్రతిమ అనే 26 ఏళ్ల యువతి ఓ ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నారు. భువనేశ్వర్ పట్టణానికి 320 కిలోమీటర్ల దూరంలో ఆమె ఉండేది. ఆమె ఫేస్‌బుక్ ద్వారా పాకిస్తాన్ వ్యక్తి పరిచయమయ్యాడు. అతనితో ప్రేమలో పడింది. అనంతరం పెళ్లి చేసుకుంది. ప్రతిమ ఇలా వెళ్తుందని తాము తాము అనుకోలేదని సదరు ఆధ్యాత్మిక సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతిమ ఆధ్యాత్మిక సంస్థకు చెందిన ఆశ్రమం నుండి వెళ్లేటప్పుడు తాను తన బంధువుల ఇంటికి వెళ్తున్నానని, వారిని చూసి కొద్ది రోజుల్లో వస్తానని చెప్పి వెళ్లింది. తమ కూతురు పాకిస్తాన్ యువకుడిని పెళ్లి చేసుకున్న విషయం తమకు తెలియదని పేరెంట్స్ చెబుతున్నారు.

Leave a Comment