ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ ఉంటే యూరప్ టూర్….

ఫేస్ బుక్ యూజర్లకు శుభవార్త. 2 వేలకు మించి ఫేస్ బుక్ ఫ్రెండ్స్ ఉన్నవారికి యూరప్ లోని నోరాడిక్ హోటల్ ఉచితంగా రూమ్ సదుపాయం కల్పిస్తుంది. 7 రాత్రులు ఉండొచ్చట. స్వీడన్ రాజధాని స్టాక్ హోంలోని లగ్జరియస్ నార్డిక్ లైట్ హోటల్ ఈ ఆఫర్ ప్రకటించింది. మామూలుగా ఈ హోటల్ ఓ గదికి రాత్రికి రూ.22 వేలు వసూలు చేస్తుంది. ఇక, ఇన్ స్టాగ్రామ్ లో మీకు 10 వేల మంది ఫాలోయర్లు ఉంటే ఉచితంగా ఓ రూమ్ పొందవచ్చట. ఇక, తక్కువ సంఖ్యలో ఫేస్ బుక్ ఫ్రెండ్స్ ఉన్నవాళ్లు బాధపడనక్కర్లేదు. వారికి కొన్ని డిస్కౌంట్లు ప్రకటించారు. 500 మంది ఫేస్ బుక్ ఫ్రెండ్స్ ఉన్నవారికి 5 శాతం రాయితీ, 1000 మంది ఫ్రెండ్స్ ఉంటే 10 శాతం, 1500 మంది ఫ్రెండ్స్ ఉంటే 15 శాతం రాయితీ ఇస్తామని తెలిపారు. 2000మంది స్నేహితులు ఉంటే, పైన చెప్పిన విధంగా 100 శాతం ఫ్రీ!

Leave a Comment