ఫైనల్స్: బాక్సింగ్‌లో మేరీ కోమ్, భారత హాకీ జట్టు

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జరుగుతున్న 17వ ఆసియా గేమ్స్‌ భారత హాకీ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్ లో దక్షిణ కొరియాపై 1-0 తేడాతో భారత్ విజయం సాధించింది.2002 ఆసియా క్రీడల తరువాత భారత్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. భారత హాకీ జట్టు బంగారు పతకం సాధించి 16 ఏళ్లు దాటింది

1998లో ధనరాజ్ పిళ్లై కెప్టెన్స్లీలో స్వర్ణం సాధించిన భారత్ ఇప్పటి వరకూ ఆ పతకాన్ని దక్కించుకోలేదు. భారత్, దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్‌కు చేరితే 2016 రియో ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధిస్తుంది.
30-indian-hockey-600

బాక్సింగ్ విభాగంలో మేరీ కోమ్ పైనల్‌కు చేరింది. 48-51 కేజీల మహిళల ప్లైవెయిట్ బాక్సింగ్ సెమిస్‌లో వియత్నాంకు చెందిన లే ధి బ్యాంగ్‌పై మేరీ కోమ్ విజయం సాధించింది. సెయిలింగ్ విభాగంలో భారత్ కాంస్యం సాధించింది. మహిళల డింఘీ ఈవెంట్‌లో వర్ష – ఐశ్వర్య జోడీ ఈ విజయాన్ని సాధించారు.
30-mary-kom-in-boxing-600

 

Leave a Comment