ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల విజేత నాదల్

Nadalపారిస్: ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల టైటిల్ ను డిఫెండింగ్ చాంఫియన్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ మరోసారి కైవసం చేసుకున్నాడు.  ఈ రోజు జరిగిన ఫైనల్లో నాదల్ 3-6, 7-5, 6-2, 6-4 తేడాతో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ను కంగుతినిపించాడు. తొలి సెట్ ను చేజార్చుకున్న నాదల్.. తిరిగి రెండో సెట్ ను గెలుచుకుని విజయానికి బాటలు వేసుకున్నాడు. అనంతరం జరిగిన రెండు సెట్లను తిరుగులేని ఆదిక్యంతో గెలుచుకున్ననాదల్ మట్టి కోర్టులపై తనకు తిరుగులేదని నిరూపించాడు. దీంతో తొమ్మిదిసారి ఫ్రెంచ్ టైటిల్ ను గెలుచుకున్ననాదల్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 2009 లో ప్రి క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగిన నాదల్ .. తిరిగి వరుసుగా ఐదోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు.
 
ఇదిలా ఉండగా ఈ టైటిల్ ను గెలిచి ‘కెరీర్ గ్రాండ్ స్లామ్’ ను పూర్తి చేయాలనుకున్న జొకోవిచ్ కు నిరాశే మిగిలింది. ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా ఓపెన్, వింబుల్డన్, యూస్ ఓపెన్ టైటిళ్లను మాత్రమే తన ఖాతాలో వేసుకున్న జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ కల మాత్రం నెరవేరలేదు.

Leave a Comment