బంకర్లో దాక్కున్న ఎలుకలు హతం….

ప్రధాని మోడీ కాశ్మీర్ లో రెండో దఫా ఎన్నికల ప్రచారానికి రానున్న నేపథ్యంలో ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారు. ఈ సందర్భంగా కలుగులో దాక్కున్న ఎలుకల్లా బంకర్ లో దాక్కుని భారత జవాన్లు,పౌరులపై కాల్పులు జరుపుతున్న నలుగురు ఉగ్రవాదుల కథ ముగిసింది. పాకిస్థాన్ సరిహద్దుల్లోని ఆర్నియా సెక్టార్ బంకర్ లోకి జవాన్ల యూనిఫాంలో దూరిన నలుగులు ఉగ్రవాదులు దాక్కున్నారు. దీనిని పసిగట్టిన జవాన్లు వారిని లొంగిపొమ్మని హెచ్చరించారు. వారు కాల్పులకు దిగడంతో భారత జవాన్లు వారిని మట్టుబెట్టారు. ఈ పోరాటంలో ఐదుగురు పౌరులు, ముగ్గురు జవాన్లును ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. నలుగురు ఉగ్రవాదులను అంతం చేయడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

Leave a Comment