బంగాళాఖాతంలో వాయుగుండం: వాతావరణ శాఖ

cycloneవిశాఖ: బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.  పోర్టుబ్లెయిర్‌కు ఉత్తరదిశగా 590కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైనట్టు అధికారులు వెల్లడించారు. గంటకు 15 కి.మీ వేగంతో వాయుగుండం కదులుతున్నట్టు ఆధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
వాయుగుండం ఈశాన్య దిశగా పయనిస్తుందన్నారు.  వాయుగుండం కారణంగా అండమాన్‌ నికోబార్‌దీవుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Leave a Comment