బంగాళాఖాతంలో విమాన శిథిలాలు

–  ఆస్ట్రేలియా కంపెనీ వెల్లడి
australia ship కౌలాలంపూర్‌ :  హిందూ మహా సముద్రంలో ప్రస్తుతం గాలిస్తున్న ప్రాంతం నుండి 5వేల కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో విమాన శిధిలాలు వున్నట్లు తాము కనుగొన్నామని, అవి మలేసియా విమాన శిధిలాలే అయి వుంటాయని భావిస్తున్నట్లు ఆస్ట్రేలియా సముద్ర అన్వేషణ కంపెనీ జియో రెజొనెన్స్‌ తెలిపింది. మార్చి 10వ తేదిన కనిపించకుండా పోయిన మలేసియా విమానం ఎంహెచ్‌ 370 కోసం తాము సొంతంగా గాలిస్తున్నామని తెలిపింది. విమానం కూలిపోయిందని భావిస్తున్న ప్రాంతానికి చుట్టుపక్కల 20లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో గాలింపు జరుగుతోంది. ఉపగ్రహాల నుండి, విమానాల నుండి తీసిన చిత్రాలను ఉపయోగించి ఈ అన్వేషణ సాగుతోంది. అణు యుద్ధ శీర్షాలను, జలాంతర్గాములను కనుగొనేందుకు ఉద్దేశించబడిన సాంకేతిక పరిజ్ఞానంతో తాము ఈ శిధిలాలను వెతుకుతున్నామని కంపెనీ తెలిపింది. ఎలగైనా వాటిని కనుగొనగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. జియో రెజొనెన్స్‌ ప్రతినిధి పావెల్‌ కర్సా మాట్లాడుతూ, బంగాళాఖాతంలో తాము అనేక రసాయన కారకాలను, ఇతర పదార్ధాలను కనుగొన్నామని చెప్పారు. బోయింగ్‌ 777ని తయారుచేసిన అల్యూమినియం, టైటానియం, కాపర్‌, స్టీల్‌ వంటి లోహాలను కనుగొన్నామన్నారు.

Leave a Comment