బదులు తీర్చుకున్న ధోని సేన

5ముంబై: గత ఏడాది ఐపీఎల్ ఫైనల్లో ఎదురైన ఓటమికి ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ బదులు తీర్చుకుంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబైని 7 వికెట్ల తేడాతో ఓడించి రెండో  క్వాలిఫయర్ మ్యాచ్ లో పంజాబ్ తో పోరుకు ధోని సేన సిద్దమయింది. ముంబై నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని చెన్నై మరో 8 బంతులు మిగులుండగానే ఛేదించింది. 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.

సురేష్ రైనా అర్థ సెంచరీతో రాణించాడు. 33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. డేవిడ్ హస్సీ 40, ప్లెసిస్ 35, డ్వేన్ స్మిత్ 24 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో హర్భజన్ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు. ఓజాకు ఒక వికెట్ దక్కింది. రెండో  క్వాలిఫయర్ మ్యాచ్ లో విజేతగా నిలిచిన జట్టు  ఫైనల్లో  కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడుంది. రైనా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అందుకున్నాడు.

Leave a Comment