బద్దలైన అగ్నిపర్వతం…30మంది మృతి…..

జపాన్ లో అగ్ని పర్వతం బద్దలై 30 మంది మృత్యువాత పడ్డారు. జపాన్ లోని నాగానో ప్రాంతంలో ఓంటేక్ పర్వతం బద్దలై లావాను ఎగజిమ్మింది. దీంతో, దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని ఆవరించింది. పర్వతం ఎగజిమ్మిన లావాలో దాదాపు 250 మంది దాకా చిక్కుబడినప్పటికీ చాలా మంది శనివారం రాత్రికి ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. దట్టమైన పొగ నేపథ్యంలో శ్వాస పీల్చుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డ 30 మంది ప్రాణాలొదిలారు.

Leave a Comment