బాలయ్య కు గిఫ్ట్ ఇస్తున్న జగన్

నటసింహం నందమూరి బాలకృష్ణ కు ఓ అరుదైన బహుమానాన్ని ఇస్తున్నాడు జగన్ . అవును జగన్ బాలయ్య కు గిఫ్ట్ ఇస్తున్నాడు కానీ ఆ జగన్ రాజకీయ నాయకుడు వై ఎస్ జగన్ మాత్రం కాదు . అనంతపురం కు చెందిన బాలయ్య అభిమాని జగన్ . ఇక ఆ గిఫ్ట్ ఏమిటంటరంటే …….. క్రిస్టల్ గ్రానైట్ లయన్ ని ఇస్తున్నాడు . ఇది 14అడుగుల పొడవున్న ఈ లయన్ ని బహుమతిగా ఇస్తున్నాడు అభిమాని . ఆల్రెడీ అభిమానుల దృష్టిలో బాలయ్య లయన్ అన్న విషయం తెలిసిందే . దాంతో లయన్ కి లయన్ బొమ్మ ని గిఫ్ట్ గా ఇస్తున్నారు . ప్రస్తతం బాలయ్య ”లయన్ ” అనే చిత్రంలో నటిస్తున్న విషయం కూడా విదితమే . ఆ చిత్రంలో బాలయ్య సరసన త్రిష ,రాధికా ఆప్టే నటిస్తున్నారు . ఈ చిత్రాన్ని మార్చి 28న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

Leave a Comment