బై వన్ గెట్ వన్ ఫ్రీ గా మెగా పండుగ !

రేపు నవంబర్ 14 దేశ వ్యాప్తంగా ఉన్న చిన్నారులకు బాలల దినోత్సవంగా ఉత్సాహాన్ని ఇవ్వబోతుంటే మెగా అభిమానులకు మాత్రం మెగా పండుగగా మారబోతోంది. బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్లు లా రేపు ప్రపంచ వ్యాప్తంగా 700 ధియేటర్లలో విడుదల కాబోతున్న సాయి ధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వు లేని జీవితం’ హడావిడికి బహుమతిగా మరొక ఊహించని బోనస్ మెగా అభిమానులకు దక్కబోతోంది.  ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆత్రంగా ఎదురు చూస్తున్న ‘గోపాల గోపాల’ ఫస్ట్ లుక్ విడుదలకు కూడా ఇదే ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకుని జనం ముందుకు రాబోతోంది అని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి.  ఇప్పటికే క్లైమేక్స్ సన్నీవేశాల చిత్రీకరణ కూడా పూర్తి అయిన ఈ సినిమాకు రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది అని అంటున్నారు. మిగిలిన ఈ చిత్రీకరణ కూడా ముగించుకుని ఎట్టి పరిస్తుతులలోను సంక్రాంతికి గోపాలుడి సందడి ఉంటుంది అన్న సంకేతాన్ని మెగా అభిమానులకు ఇవ్వడానికి రేపటి రోజును మెగా పండుగగా మారుస్తూ పవన్ రంగంలోకి దిగుతున్నాడు అని టాక్.  దీనితో ఒక వైపు సాయి ధరమ్ తేజ్ సినిమా హడావిడి మరొక వైపు పవన్ ‘గోపాల గోపాల’ ఫస్ట్ లుక్ సందడితో రేపటి రోజు అంత మెగా అభిమానులకు పండగే పండుగ అని అనుకోవాలి.

Leave a Comment