బ్రహ్మానందాన్ని పక్కన పెట్టబోతున్నారా?

ఈ మధ్య కాలంలో చాలా మంది కామెడియన్స్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అవుతున్నారు.అందుకు కారణం ఏంటంటే సీనియర్ కమెడిన్సే అని అంటున్నారు. ఈ మధ్య ఏ సినిమా సూపర్ హిట్ అయినా అందులో మేజర్ షేర్ బ్రహ్మానందంకే వెళుతోంది. స్టార్ హీరో నుంచి స్మాల్ హీరో వరకు ఇప్పుడు కామెడీని, దానికి రారాజైన బ్రహ్మానందాన్ని నమ్ముకోవడం పెరిగిపోతోంది. దీంతో ఒకసారి హిట్ అయిన ఫార్ములానే సేఫ్ జోన్ గా అటు ఇటూ తిప్పి అదే కామెడీ అతనితో చేయిస్తున్నారు. కానీ బ్రహ్మీ మాత్రం ఇప్పటి వరకూ సాధ్యమైనంత క్లవర్ గానే తను చేస్తున్న కామెడీ మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే బ్రహ్మానందం కాల్షీట్స్ కి కూడ భారీ డిమాండ్ ఉంది. దీంతో అన్ని మూవీలలో నిర్మాతలు బ్రహ్మానందం రెమ్యునరేషన్ ని భరించలేకపోతున్నారు. దీంతో స్టార్ హీరోల మూవీలు తప్పితే, మిగతా చిన్న, మధ్య తరహా మూవీలలోనూ ఇతర కమెడియన్స్ తోనే మూవీని ముగించేస్తున్నారు. కామెడీ ట్రాక్ పై కససరత్తులు చేసి, దాన్ని చిన్న కమెడియన్స్ తో స్క్రీన్ పై హిట్ అయ్యేలా దర్శకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విధంగా బ్రహ్మానందాన్ని చిన్న మూవీలకు పూర్తిగా దూరం చేశారు దర్శక,నిర్మాతలు. అలాగే పెద్ద హీరోలు సైతం బ్రహ్మనందం ఇచ్చిన కాల్షీట్స్ ని పూర్తి వాడుకుంటూ, సాధ్యమైనంత వరకూ తక్కువ కాల్షీట్స్ తో పూర్తి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా బ్రహ్మానందం మాత్రం తనదైన పంచ్ లతో ప్రేక్షకులని అలరిస్తూనే ఉన్నాడు. కాని రెమ్యునరేషన్ మాత్రం భారీగా ఉండంతో బడా నిర్మాతలు సైతం కొన్ని మూవీల్లో బ్రహ్మనందాన్ని పక్కన పెట్టిన సందర్భాలు ఉన్నాయి.

Leave a Comment