బ్రిటిష్ పార్లమెంట్ లో “బ్రిటిష్ సౌత్ ఇండియన్ బిజినెస్ మీట్”

బ్రిటిష్ సౌత్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కామర్స్(BSICC) మరియు తెలంగాణా ఎన్నారై ఫోరమ్ (TeNF) -యూకే శాఖ సంయుక్తంగా లండన్ లోని
బ్రిటిష్ పార్లమెంట్  లో
“బ్రిటిష్ సౌత్ ఇండియన్ బిజినెస్ మీట్”  (British South Indian Business Meet)నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణా, ఆంధ్ర, తమిళనాడు, కర్నాటక మరియు కేరళ రాష్ట్రాల ప్రతినితులు,  స్థానిక బ్రిటన్ ఎంపీ వీరేంద్ర శర్మ తో పాటు ఇతర ఎంపీ లు పాల్గొన్నారు.
తెలంగాణా రాష్ట్రం నుండి భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు, తెలంగాణా టూరిసం సెక్రెటరీ బుర్ర వెంకటేశం గారు, ఏం.డీ డాక్టర్ క్రిస్టీన మరియు తెలంగాణా ఎన్నారై ఫోరమ్ అద్యక్షుడు సిక్క చంద్రశేఖర్ గౌడ్
 వ్యవస్థాపక సబ్యుడు – ఎన్నారై టి.ఆర్.యస్ అద్యక్షుడు అనిల్ కూర్మాచలం, అడ్వై సరి బోర్డ్ ఛైర్మన్ ఉదయ్ నగరాజు  పాల్గొన్న వారిలో ఉన్నారు.
బ్రిటన్ ఎంపీ మరియు BSICC పాట్రన్ వీరేంద్ర శర్మ  ముందుగా స్వాగతో పన్యాసం ఇస్తూ భారత – యూకే దేశాల మద్య ఉన్న మంచి వ్యాపార అనుకూల విధానాల గురించి వివరించి, వాటిని సద్వినియోగం చేసుకోవాలని హాజరైయన  అన్ని రాష్ట్రాల ప్రతినితులని కోరారు.  ముక్యంగా తెలంగాణా ప్రతినుతులని ప్రశంశిస్తు  ముఖ్య మంత్రి కే. సీ. ఆర్  గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతున్న తీరును అభినందించారు .

 భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు మాట్లాడుతూ … తెలంగాణా రాష్ట్ర విశిష్టత, ప్రస్తుత ఆర్థిక పరిస్థితీ , గణాంకాల తో సహా  …. ఐ.టి ,ఫార్మా ఫుడ్ ప్రోసెసింగ్ ,ఇన్‌ఫ్రా స్ట్రక్చర్, పవర్,నీళ్ళు  ..  ప్రతి రంగం లో గత సంవత్సర కాలం లో రాష్ట్ర ప్రభుత్వం సాదించిన విజయాలు, తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు.
 ప్రపంచం లో ఎక్కడా లేనటువంటి సరికొత్త నూతన పారిశ్రామిక విదానం టీ. యస్ ఐ పాస్ (TSiPass)విధి విధానాల గురించి వివరించారు.
 ముక్యంగా  తెలంగాణా ప్రభుత్వం – ముఖ్య మంత్రి కే. సీ. ఆర్  గారు అవినీతి లేని పెట్టుబడులకి అనుకూల నిర్ణయాలన్ని సభకు వివరించారు.
రోజు రోజుకు అబివృద్డిలో హైదరాబాద్  దూసుకెళ్తున్న తీరు గురించి ప్రత్యేకంగా వివరించారు, నేడు రాష్ట్రం లో   ప్రారంభమైన భారత దేశం లోనే అతి పెద్ద ఇంకూబేటార్ టి. హబ్ (T-HUB) గురించి ప్రత్యేకంగా వివరించారు .
british 3british2

Leave a Comment