భారతరత్న ఇవ్వకుంటే పార్లమెంట్ ఎదుట ధర్నా

శ్రీకాళహస్తి : తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని వెలుగెత్తి చాటిన దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించాలని ఆయన సతీమణి లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. లేకుంటే పార్లమెంట్ 4ఎదుట ధర్నా చేస్తానని ఆమె హెచ్చరించారు. శుక్రవారం లక్ష్మీపార్వతి శ్రీకాళహస్తి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె రాహు కేతు పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం లక్ష్మీపార్వతి విలేకర్లతో మాట్లాడుతూ తెలుగు జాతికి, పేదల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమం పధకాలు అమలు చేశారన్నారు.

Leave a Comment