భారత్, ఆస్ట్రేలియా మధ్య ఒప్పందాలు

భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య సామాజిక, తీర ప్రాంత భద్రత, ఖైదీల బదలాయింపు, మాదక ద్రవ్యాల వాణిజ్యం అరికట్టడం, పర్యాటకం, సాంస్కృతిక రంగాలపై ఒప్పందాలు కుదిరాయి. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్‌లు ఈ సందర్భంగా ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ సామాజిక భద్రత ఒప్పందం సానుకూలమైన పరిణామమని అన్నారు. 2015లో ఆస్ట్రేలియాలో ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. భారత్ సూపర్ పవర్‌గా ఎదుగుతుందని ఆకాంక్షిస్తున్నామని ఆస్ట్రేలియా ప్రధాని అబాట్ వెల్లడించారు.

Leave a Comment