భూకంపం @ బీచువాన్…

China2008, మే 12న చైనాలో భారీ భూకంపం వచ్చింది. బీచువాన్ పట్టణం గడగడలాడిపోయింది. దాదాపు 9 వేల మంది చనిపోయారు.. 80 శాతం భవనాలు నేలకూలాయి.. కొన్ని బాగా దెబ్బతిన్నాయి.. ఆరేళ్లు గడిచిపోయాయి. మీరిప్పుడు బీచువాన్‌కు వెళ్లిచూడండి.. కొన్ని నిమిషాల ముందే అక్కడ భూకంపం వచ్చిందా అన్న ఫీలింగ్ కలుగుతుంది. మనం టైం మెషీన్ ఎక్కి.. 2008, మే 12వ తేదీకి వెళ్లిపోయిన ట్లు అనిపిస్తుంది. ఎందుకంటే.. నాటి భూకంపం అనంతరం భవనాలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాయో.. ఇప్పుడూ అలాగే ఉన్నాయి.. కాదు.. కాదు.. వాటిని అలాగే ఉంచేశారు.

బీచువాన్‌ను అతి పెద్ద స్మారక ప్రదేశంగా మార్చేశారు. వేలాడుతున్న భవనాలు కింద పడి.. సందర్శకులకు దెబ్బలు తగలకుండా ఉండేందుకు సపోర్ట్ ఏర్పాటు చేశారు.. కూలిపోయిన భవనాలు.. వాటి కింద చిక్కుకున్న వాహనాలు ఇప్పటికీ అన్నీ అలాగే ఉన్నాయి.. అప్పట్లో భూకంపం వచ్చిన తర్వాత చాలా వరకూ భవనాలు కూలిపోవడం.. ఊరంతా రాళ్లు, రప్పలతో నిండిపోవడంతో ఈ పట్టణాన్ని పున ర్నిర్మించడం చాలా కష్టమని నిపుణులు అభిప్రాయానికొచ్చారు. దీంతో వాటిని అలాగే ఉంచేసి.. బహిరంగ ప్రదేశంలో ఉన్న అతి పెద్ద స్మారక ప్రదేశంగా దీన్ని తీర్చిదిద్దారు. ఇక్కడుండేవారంతా బీచువాన్‌కు 12 మైళ్ల దూరంలో నిర్మించిన కొత్త పట్టణానికి వలస పోయారు.

Leave a Comment