భూటాన్ లో మోడీకి రెడ్ కార్పెట్

Modiభూటాన్: రెండు రోజుల పర్యటన కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ భూటన్ చేరుకున్నారు. భూటాన్ లోని పారో విమానాశ్రయంలో ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది.
భూటన్ భద్రతాదళాలు ఇచ్చిన గౌరవ వందనాన్ని ప్రధాని మోడీ  స్వీకరించారు. ప్రధానిగా మోడీకి ఇదే తొలి విదేశీ పర్యటన. స్థానిక కాలమానం ప్రకారం మోడీ 11.40 నిమిషాలకు థింపూ కు చేరుకున్నారు.
నరేంద్ర మోడీతో పాటు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ డోవల్, విదేశాంగ కార్యదర్శి సుజాతాసింగ్ లు పర్యటిస్తున్నారు.

Leave a Comment