భూమి, చంద్రుడి వయసు 6 కోట్ల ఏళ్లు ఎక్కువ..!

solar familyసౌరకుటుంబంలో మన భూగోళం గ్రహంగా రూపుదిద్దుకుని సుమారు 450 కోట్ల సంవత్సరాలు అయిందని అంచనా. అలాగే భూమి ఏర్పడిన కొంత కాలానికే అంగారకుడి సైజులో గల ఓ గ్రహం వంటి వస్తువు ఢీకొట్టిందని, ఫలితంగా భూమి నుంచి వేరుపడిన ముక్కలు కలిసి చంద్రుడిగా ఏర్పడ్డాయనీ శాస్త్రవేత్తలు చెబుతారు. అయితే ఇప్పటిదాకా ఉన్న అంచనాల కంటే భూమి, చంద్రుడి వయసులు మరో 6 కోట్ల ఏళ్లు ఎక్కువగానే ఉండొచ్చంటున్నారు ఫ్రాన్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లారెన్‌కు చెందిన అవీస్, బెర్నార్డ్ మార్టీలు. వివిధ వాయువుల(ఐసోటోపుల) శాతాలను, స్థితులను బట్టి భూమిపై వాతావరణపరంగా కీలక పరిణామాలను అంచనా వేసే రేడియో డేటింగ్ పద్ధతిలోనే తాము కూడా పరిశోధించామని వీరు వెల్లడించారు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలలో లభించిన 340 కోట్లు, 270 కోట్ల ఏళ్లనాటి క్వార్ట్జ్ ఖనిజాలలో చిక్కుకుపోయిన జెనాన్ వాయువుపై అధ్యయనం చేసిన తాము రేడియో డేటింగ్ పద్ధతిలో కాలాన్ని అంచనా వేసినట్లు తెలిపారు.
 

Leave a Comment