మంచు విష్ణూ డ్రాప్‌

మంచు ఫ్యామిలీ హీరో విష్ణు త్వరలో జరుగబోయే మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్ష ఎలక్షన్‌లో పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని విష్ణు వివరణ ఇచ్చారు. తాను పోటీ చేయడం లేదని, మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్ష పదవి చేపట్టేంత స్థాయి ఇంకా తనకు రాలేదని ట్వీట్‌ చేసారు. రాజేందప్రస్రాద్‌ అంకుల్‌ పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఆయనకు నా మద్దతు ఉంటుంది అన్నారు.

రాజేంద్రప్రసాద్‌ పోటీ చేస్తున్నట్లు గత కొన్ని రోజుల క్రిత్రమే ప్రకటిం చారు. ఈ నెల 29న మా కార్యవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం మా అధ్యక్షుడిగా ప్రముఖ నటుడు మురళీ మోహన్‌ కొనసా గుతున్నారు. అయితే ఏకగ్రీవ ఎన్నిక కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పిన రాజేందప్రస్రాద్‌…. ఒకవేళ మా అధ్యక్ష పదవికి పోటీ ఉన్నా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. గత కొన్నేళ్లుగా ఈ పదవిలో కొనసాగు తున్న మురళీ మోహన్‌ స్థానం ఖాళీ అయితే కొత్త వ్యక్తి రావాలని పలువురు ఆర్టిస్టులు కోరుకుంటున్నారు. రాజేందప్రస్రాద్‌ మా అధ్యక్ష పదవికి అన్ని విధాలా అర్హుడని పలువురు ఆర్టిస్టులు అభిప్రాయ పడు తున్నారు.

Leave a Comment