యువ హీరో గోపీచంద్ అభిమానులకు శుభవార్త. లౌక్యం చిత్రం తో విజయం సాధించిన గోపీచంద్ తండ్రయ్యాడు. గోపీచంద్ భార్య రేష్మ సోమవారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ దేవుడు తనను మగబిడ్డతో ఆశీర్వదించాడని ట్విట్టర్ లో వెల్లడించారు. తనకు దీవెనలు అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. తన తండ్రి చిన్నతనంలోనే దూరం కావడం వల్ల మగబిడ్డ పుట్టాలనే గోపీచంద్ కోరుకున్నాడు. వ్యక్తిగత జీవితాన్ని, సినీ జీవితాన్ని చక్కగా ఆస్వాదిస్తున్న గోపీచంద్ ఇంటికి మరో జూనియర్ రావడంతో అతను ఆనందంలోమునిగితేలుతున్నాడు. హీరో గోపీచంద్ వివాహం రేష్మతో మే 12, 2013న హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. గోపీచంద్ భార్య రేష్మ .. హీరో శ్రీకాంత్ కు బంధువు.
Recent Comments