మరొక్కసారి అవకాశం ఇవ్వండి…

ఢిల్లీలో అధికారం చేపట్టి 49 రోజుల్లోనే రాజీనామా చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. మరొక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఆప్‌కు ఘన విజయం అందించాలని కోరారు.ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆప్.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అధికారం చేపట్టింది. అవినీతి నిరోధక బిల్లు ఆమోదానికి పూర్తి మెజారిటీ లేకపోవడంతో సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో 49 రోజుల్లోనే ప్రభుత్వం కూలిపోయింది. దీంతో అప్పటినుంచి ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమలులో ఉంది. మోదీ పిలుపునిచ్చిన స్వచ్ఛభారత్ కార్యక్రమం ఎంతో మంచి ఆలోచన  కేజ్రీవాల్ పేర్కొన్నారు.

Leave a Comment