మహేష్ ,ఎన్టీఆర్ ,చరణ్ లను పడేసిన భామ

rakul

సాలిడ్ అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ముగ్గురు టాప్ స్టార్స్ ని పడేసింది. అవును వరుసగా ముగ్గురు పెద్ద హీరోల చిత్రాల్లో చాన్స్ లు కొట్టేసి యావత్ సినీ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పటికే ఎన్టీఆర్ సినిమాలో అలాగే చరణ్ సినిమాలో హీరోయిన్ గా చాన్స్ కొట్టేసిన రకుల్ చూపు తాజాగా మహేష్ పై పడింది దాంతో మహేష్ తాజాగా నటించబోయే ”బ్రహ్మోత్సవం ” చిత్రంలో రకుల్ నే తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారట . వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమ కి వచ్చిన ఈ భామ ఇటీవల గోపీచంద్ తో చేసిన ”లౌక్యం ” సూపర్ హిట్ కావడంతో అగ్ర హీరోల చూపు రకుల్ పై పడింది. దాంతో దాన్ని క్యాష్ చేసుకోవడానికి రెడీ అయ్యింది ఈ భామ

Leave a Comment