మానవ సంభందాలు అన్ని క్షణిక అనుభవాలే ?దేని కోసము మనము బతుకు తున్నాము ?

whatsapp

మానవ సంభందాలు అన్ని క్షణిక అనుభవాలే ?దేని కోసము మనము బతుకు తున్నాము ?
మనము ఉదయము లేచిన దగ్గరనుంచి అసలు ఏమి చేస్తున్నాము. మొబైల్ ఫోన్ లో వాట్స్ అప్ చూసి కుని టాయిలెట్ లోకి వెళుతున్నాము .మరల అభద్రతా భావము మన ఫోన్ లోని చాటింగ్ మన భార్య లేక మన భర్త లేక మన పిల్లలు ఎక్కడ చూస్తారో అని? మొబైల్ ఒక చేతి లో టాయిలెట్ లోనికి .

కాసేపు టాయిలెట్ సింక్ మీద కూర్చుని మనకు నచ్చిన గ్రూప్ మరియు వ్యక్తుల చాట్ చూసి మొబైల్ పక్కన పెట్టి షవర్ చేసి బయట పడుతున్నాము బాత్రూం నుంచి.

భార్య భర్త తో రెండు మాటలు
టిఫిన్ బాక్స్ పెట్టాను అని చెప్పటం, మరిచి పోవద్దు అని ఒకో సారి చెపుతారు లేక ఒకో సారి ఆ ముక్క కూడా చెప్ప దు భార్యా మణి.పిల్లలు చిన్న వాళ్ళు అయితే వాళ్ళ ను హడావిడి గా రెడీ చేసి భర్త కు అప్ప చెప్పటం.
భర్త పిల్లలు ను స్కూల్ లో దిగ బెడుతూ వాట్స్ అప్ ఒక వంద సార్లు అయినా చూస్తాడు  పరుగెడుతూ లేక  కారు నడుపుతూ. నచ్చిన పోస్టింగ్ ని కట్ చేసి ఇంకో గ్రూప్ లో పెట్టి ఎవరైనా లైక్ చేసారా అని ఒక రెండు వందల సారులు చూస్తాడుఆఫీస్ కి వెళ్లే లోపు.

ఇంకో సీను

పిల్లలును స్కూల్ కి రెడీ చేస్తూ , వంట చేసు కుంటూ ఒక పది సార్లు వాట్స్ అప్ చూసుంటుంది భార్య మణి.

పిల్లలు స్కూల్ , భర్త ఆఫీస్ కి వెళ్లిన వెంటనే మరియు తాను ఇంటిలో నుంచి ఆఫీస్ పని (WORK FROM HOME)మొదలు .ఆఫీస్ కంప్యూటర్ లో లాగ్ ఇన్ అయ్యి న తరువాత.
భార్య లేడీస్ స్పెషల్ గ్రూప్ లో పోస్టింగ్స్ చూడటము మరల తనకు నచ్చిన ఇద్దరు లేక ముగ్గురి తో (విడిగా వీరి ముగ్గురికి స్పెషల్ గ్రూప్) ఆ రోజు జరిగిన విశేషాలు లేక మెయిన్ గ్రూప్ లోని నచ్చని మనుషుల మీద అందరు కలిసి వాట్స్ అప్ గ్రూప్ లో కామెంట్స్ షేర్ చేసుకోవటం ?
డైమండ్స్ , నగలు , చీరలు దగ్గర నుంచి ఇళ్ల వరకు మాట్లడుకోవటము చాలా మటుకు ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకుంటారు . ఒక వేళ కొంచము గొప్పలు ఎక్కువ చెప్పిన మూడో మనిషి మీద ఈ ఇద్దరు జోక్స్ వేసుకుంటూ చూడు ! ఎలా చెపుతుందో గొప్పలు అని కామెంట్ ఫోన్ లో వీరు ఇద్దరు.

ఈ విధము గా దినము గడుస్తుంది.

సీను సాయం కాలము
భార్య భర్త తో ఆఫీస్ నుంచి వచ్చిన భర్త తో అంటుంది .
పొద్దున్న నుంచి వాట్స్ అప్ లోనే ఆన్ లైన్ లో ఉన్నావు ? ఒక్క సారి అయినా మాట్లాడ లేదు అని
( ఈవిడ మాత్రం ఆ పని చేయదు ) ఎవరితో చాటింగ్ చేస్తున్నావు అన్ని గంటలు ? అని భార్య భర్త మధ్య ఒక నిముషమువాదన.

తరువాత సాయంత్రము పిల్లల తో మొక్కు బడి గా ఇద్దరు –
బాగా చదవాలి. హోమ్ వర్క్ చేసు కొండి అని పురమాయింపు .
ఇంతలో ట్రింగ్ ట్రింగ్
రావు గారు! ఈ రోజు ఆ కృష్ణ 100 పోస్టింగ్స్ పెట్టాడు.అన్ని పోస్టింగ్స్ చదవ లేక పోతున్నాము. మన టైం వేస్ట్ చేస్తున్నాడు అతను. మనము ఈవెనింగ్ 9 గంటల కు మనము అనుకున్న వాళ్ళము కలిసి కాన్ఫరెన్స్ కాల్ లోమాట్లాడు కుందాము అని ఈ పోస్టింగ్స్గురించి.
ఈ ఫోన్ సంభాషణ ముగిసే లోపున ఫ్లాష్ లాంటి న్యూస్ —
మన రావు గారు మరియు ఇంకో నలుగురు వీళ్ళు మాట్లాడు కుంటున్న వాట్స్ అప్ గ్రూప్ నుంచి బహిష్కరణ అని.

మన రావు గారు బహిష్కరణ అయిన మరో నలుగురు మెంబెర్స్ తో వీకెండ్ మీటింగ్.
అజెండా లో  మనము కమ్యూనిటీ కి ఎలా సేవ చేద్దాము అని. కానీ ఈ కమ్యూనిటీ సేవ లో కృష్ణ రాకూడదు అని ప్రతిపాదన .
ఈ భర్త గోల ఎలా ఉంటే ఈయన భార్య తన లేడీస్ గ్రూప్ లో డైమండ్స్, చీరలు మరియు ఇళ్ల గోల మాములే.

ఇది ఇలా  ఉంటె
పిల్లలు ఏమి మాట్లాడుకుంటున్నారో చూద్దాము ఒక సారి.

మన కథలోని రావు గారికి ఇద్దరు పిల్లలు. అడ పిల్ల కు 12 మరియు అబ్బాయి కి 8.

అడ పిల్ల ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ తో ఇలా అంటుంది –

మాకు ప్రతి వూరి లో ఒక ఇల్లు, ఇక కారు . ఈ మధ్య నే ఒక హెలి కాఫ్టర్ కూడా కొన్నారుగా నాన్నఅని  అక్కతో  8 ఏళ్ళ తమ్ముడు పక్క నుంచి.

అది వింటున్న మిగతా పిల్లలు

మీరు సూపర్ రిచ్ అన్న మాట ! గ్రేట్ అని

ఇదీ ఇంటింటి వాట్స్ అప్ రామాయణము .
క్షమించాలి. కేవలము సరదాగా రాసినిది. ఎవరిని కించపరచటానికి కాదు.

శేఖర్ వేమూరి
తెలుగు వార్త

Leave a Comment