మాలో విభేదాలులేవు

Janareddyహైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో సమన్వయలోపం లేదని సీఎల్పీ నేత జానారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో  ఓటమికి పార్టీలో సమన్వయ లోపమే కారణమని మాజీ ఎంపి రాజయ్యతో పాటు పలువురు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించిన విషయం తెసిందే. రాష్ట్రం ఇచ్చినా పదేళ్ల పాటు అధికారంలో ఉన్నందున సహజంగా ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకత, దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభంజనం, పార్టీలో సమన్వయలోపం వంటి  కారణాల వల్ల ఓడిపోయినట్లు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ మాజీ ఎంపిలు  అభిప్రాయపడ్డారు. సీపీఐతో పొత్తు కారణంగా కాంగ్రెస్ నష్టపోయిందని కొందరు నేతలు అన్నారు.

ఈ నేపధ్యంలో తమ  పార్టీ ఎమ్మెల్యేలు కొందరు ఆవేశంతో మాట్లాడతుంటారని, అయితే తమలో విభేదాలు మాత్రం లేవని జానారెడ్డి చెప్పారు.

Leave a Comment