మా పరమేశ్వర్ జాడేది..?

Chindam Parameshwarకన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు
నర్సంపేట : ఏడు రోజులు గడిచారు.. వూ పరమేశ్వర్ జాడ తెలియుట్లేదు.. తిరిగొత్తాడనే ఆశ ఉంది.. టీవీల ముందు కూసోని ఎదురు చూస్తున్నం.. ఈ వూటలు నర్సంపేటలోని చిందం పరమేశ్వర్ కుటుంబ సభ్యులవి. హివూచల్‌ప్రదేశ్‌లోని బియూస్ నదీ ప్రవాహంలో కొట్టుకుపోరు ఇంజినీరింగ్ విద్యార్థుల్లో నర్సంపేట పట్టణానికి చెందిన చిందం పరమేశ్వర్ ఉన్న విషయం తెలిసిందే.
 అతడి కోసం తల్లిదండ్రులు వీరన్న-ఉవు, అక్క ప్రియూంక, అన్న ప్రశాంత్ కన్నీరువుున్నీరుగా రోదిస్తున్నారు. పరమేశ్వర్ జాడ తెలుసుకోవడానికి సోదరుడు ఘటనా స్థలానికి వెళ్లివచ్చాడు. అయినా జాడతెలియలేదు. పరమేశ్వర్ క్షేవుంగా ఇంటికి రావాలని అతడి ప్రాణమిత్రులు, బంధువులు, పలు సంఘాల బాధ్యులు ఇష్టదైవాలను వేడు కుంటూ సంఘీభావం తెలుపుతున్నారు.
క్షణమొక యుగం
కన్న బిడ్డల కోసం ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడంలేదు. హిమచల్‌ప్రదే శ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన ఇంజినీరింగ్ విద్యార్థుల్లో నర్సంపేటకు చెందిన పరమేశ్వర్, వరంగల్ నగరంలోని గిర్మాజీపేటకు చెందిన అఖిల్ ఉన్నాడు. సంఘటన జరిగి ఏడు రోజులు గడిచానా వారి ఆచూకీ దొరక్కపోవడంతో ఇంటిల్లిపాది ముద్దకూడ ముట్టడంలేదు. కంటిమీద కునుకులేదు. ఏడ్చి ఏడ్చి కళ్లల్లోనే నీరు ఇంకిపోతోంది. క్షణమొక యుగంగా గడుపుతున్నారు.
 వరంగల్ : హిమచల్‌ప్రదే శ్‌లోని బియాస్ నదిలో గల్లంతైనా ఇంజినీరింగ్ విద్యార్థి అఖిల్ కోసం కుటుంబ సభ్యులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. వరంగల్ నగరంలోని గిర్మాజీపేటకు చెందిన అఖిల్ ఈనెల 3న రాత్రి స్వగృహం నుంచి విజ్ఞాన యాత్రకు బయలు దేరిన అతను తిరిగి ఈనెల 15న రాత్రికి ఇంటికి తిరిగొస్తానని తల్లిదండ్రులకు చెప్పాడు. కొడుకును ఉన్నత చదువులు చదివించి గొప్ప హోదా లో చూడాలని ఆ తల్లిదండ్రుల ఎన్నో కలలు కన్నారు. ఎన్ని ఇబ్బందులుపడినా కొడుకుకు కష్టమంటే తెలియకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ చది విస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం విహార యాత్రకు వెళ్లిన విద్యార్థులు నేడు (ఆది వారం) తిరిగి రావాలసి ఉంది.
 ఈనెల 8న హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదీ ప్రవాహం లో తోటి విద్యార్థులతోపాటు అఖిల్ గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న నాటి నుంచి తల్లిదండ్రులు మిట్టపల్లి సంజయ్-సునీత, అక్క మౌనిక నిద్రహారాలు మాని అఖిల్ కోసం ఎదురు చూస్తున్నారు. అతడిని గుర్తు చేసుకుంటూ రోదిస్తున్నారు. చిన్న విషయమైనా జాగ్రత్త తీసుకునే తన కుమారుడు  వరదముంపు నుంచి బయట పడలేకపోయాడని తండ్రి సంజయ్ కొడుకును తలుచుకుంటూ ఏడుస్తున్నాడు. ‘కొడుకు ఇవ్వాల(15న) ఇంటికి వస్తానని చెప్పిండు.. తప్పకుంట వస్తడు’ అని విలపిస్తున్న తల్లి సునీతను ఓదార్చడం ఎవరి తరమూ కావడంలేదు.
 కనీస సమాచారం ఇవ్వని అధికార యంత్రాంగం
 హిమచల్‌ప్రదేశ్‌లో గల్లంతైన గిర్మాజీపేటకు చెం దిన అఖిల్ యోగ క్షేమాలను ఆ కుటుంబ సభ్యులకు తెలియజేయడంలో జిల్లా అధికార యం త్రాంగం విఫలమైంది. బియాస్ నదిలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విషయాలను ఎప్పటికప్పడు తెలుసుకుంటూ పురోగతిని ఆ కుటుంబ సభ్యులకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఉండగా ఇంత వరకు ఎవరూ అఖిల్ కుటుంబ సభ్యుల వద్దకు వచ్చిన దాఖ లాలు లేవు. దీంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Leave a Comment