మిస్టర్ ఒబామా.. నా ప్రేయసిని ముట్టుకోవద్దు’..

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. షికాగోలో ఓటు వేయడానికి ఆయన వెళ్లినప్పుడు.. అక్కడో వ్యక్తి ఆయన్ను ఆపాడు. మిస్టర్ ఒబామా.. నా ప్రేయసిని ముట్టుకోవద్దుఅన్నాడు. దాంతో ఒబామాతో పాటు.. సదరు ప్రేయసి కూడా ఒక్క నిమిషం షాక్ తిన్నారు. షికాగోలో ఓటువేయడానికి వెళ్లిన ఒబామా.. కూపర్ అనే మహిళ పక్కన నిల్చున్నారు. ఆయనతో సరదాగా మాట్లాడాలనుకున్న కూపర్ బాయ్ ఫ్రెండ్ మైక్.. ఒబామాతో అలా మాట్లాడాడు. తర్వాత సరదా కోసమే అలా చేసినట్టు చెప్పుకొచ్చాడు. ఒబామా కూడా దాన్ని తేలిగ్గా తీసుకొని.. కూపర్కు ఓ చిన్నపాటి కౌగిలి, ముద్దు ఇచ్చారు. ఇప్పుడు ఆమె బాయ్ ఫ్రెండ్ నిజంగా అసూయ పడతాడని కూపర్ తో అన్నారు.

Leave a Comment