మీట్ అండ్ గ్రీట్ విత్ తెలంగాణా మండలి ఛైర్మన్ శ్రీ స్వామి గౌడ్

లండన్ లో  ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ ఆద్వర్యం లో “మీట్ అండ్ గ్రీట్ విత్ తెలంగాణా మండలి ఛైర్మన్ శ్రీ స్వామి గౌడ్” మరియు దాశరథి గారి జయంతి   ఘనంగా నిర్వహించారు,
యు.కే నలుమూలల నుండి భారీగా తెరాస కార్యకర్తలు, తెలంగాణా వాదులు హాజరయ్యారు.
 కార్యదర్శి నవీన్ రెడ్డి గారి అద్యక్షత జరిగిన కార్యక్రమంలో ముందుగా ..అమరులకు స్మరించుకొని, దాశరథి గారికి మరియు జయశంకర్ గారికి నివాళ్ళు అర్పించి , కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ నాలుగు సంవత్సరాలలో చేసిన ముఖ్య కార్యక్రమాల వీడియో ని ప్రదర్శించి, అతిథులకు  వివరించారు.
స్వామి గౌడ్ గారి ఉద్యమ – రాజకీయ ప్రస్థానం తో కూడిన ఒక వీడియో ని కూడా ప్రదర్శించారు.
తెలంగాణా మండలి ఛైర్మన్ శ్రీ స్వామి గౌడ్ గారు మాట్లాడుతూ, ఉద్యమం లో ఎన్నారై ల పాత్ర గొప్పదని తెలిపారు,  ఉద్యమ సంధర్భం లో ఎన్నారై ల  పోరాటమిచ్చిన స్పూర్తి ఎప్పటికీ మారవలెనని, ముక్యంగా లండన్ లోని ఎన్నారై. టి.అర్.యస్  విభాఘం పిలుపిచ్చిన ప్రతి కార్యక్రమాన్నికి మద్దతుగా ఇక్కడ నుండి మద్దతు తెలిపిన తీరు చాలా గొప్పదని ప్రసంశీంచారు. బంగారు తెలంగాణా నిర్మాణ దిశ లో   టి.అర్.యస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని – పథకాల గురించి  వివరించారు,  టి.అర్.యస్ ప్రబుత్వం ప్రతి ఒక్కరిని కలుపుకొని అందరి సూచనలని తీసుకొని ముందుకు వెతుందని కాబట్టి మీరు కూడా ఎటువంటి సలహాలు అయిన లేదా సందేహాలు ఉన్న వ్యక్తిగతంగా నన్ను కాని, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కాని సంప్రదించవచ్చు అని తెలిపారు. మనం కలలు కన్న బంగారు తెలంగాణ కోసం కెసిఆర్ గారు ఆహార్ నిశలు కష్టపడ్తున్నారని ఎటువంటి సందేహాలు అవసరం లేదని హామీ ఇచ్చారు.
ఎన్నారై. టి.అర్.యస్ అద్యక్షులు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ , ఎంతో బిజీగా ఉన్నపటికీ  సమయం ఇచ్చి కార్యక్రామానికి వచ్చినందుకు శ్రీ స్వామి గౌడ్  గారికి కృతఙ్ఞతలు తెలిపారు, ఎన్నారై టి.అర్.యస్ సెల్ కి ఎప్పటికప్పుడు కెసిఆర్ గారు మరియు యావత్ టి.అర్.యస్ నాయకులు,  ఇస్తున్న ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు తెలిపారు. ఒక ఉద్యోగ నేత నుండి ఉద్యమ నేతగా …అలాగే నేడు నేతాలకే నేతగా స్వామి గౌడ్ గారి ప్రస్థానం గురించి, తెలంగాణా ఉద్యమ సమయం లో ..నేడు పునర్నిర్మాణం లో వారి పాత్ర గురించి సభకు వివరించారు.  తెలంగాణా పునర్న్నిర్మాణం కేవలం కెసిఆర్ గారి వల్లే సాధ్యమని, వారి నాయక్తవాన్ని బలపరచడం చారిత్రాత్మక అవసరమని సభకు తెలిపారు. ఎలాగైతే ఉద్యమం లో వారి వెంట ఉండి ముందుకు నడిచామో, అలాగే బావిష్యత్తులో కూడా వారు చూపిన బాట లో నడుస్తామని తెలిపారు. కెసిఆర్ గారి ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు ప్రపంచం లో తెలంగాణా బిడ్డ ఎక్కడున్నా అక్కడ ఎన్నారై. టి.అర్.యస్ శాఖలు ఏర్పాటు చేసి గులాబిమయమ్ చేయడమే  లక్ష్యం అని తెలిపారు. పునర్నిర్మాణం లో కూడా కెసిఆర్ గారి  వెంట ఉంటామని తెలిపారు.
కరీంనగర్ నాయకులు కాసర్ల తిరుపతి రెడ్డి గారు మాట్లాడుతూ…బ్రతుకు తెరువుకు వచ్చి, మాతృ భూమి కోసం వీళ్ళు చేస్తున్న పోరాటం చాలా గొప్పదని ప్రసంశీంచారు.
ఉపాద్యక్షులు మంద సునీల్ రెడ్డి  మాట్లాడుతూ…రాజకీయ పార్టీ అయినప్పటికీ, ఎన్నారై లు గా…మయ వంతు బాద్యతగా తెలంగాణా ప్రజలకు చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి సభకు వివరించారు.
ప్రధాన కార్యదర్శి దూసారి అశోక్ గౌడ్ మాట్లాడుతూ….క్షేత్రస్థాయిలో ఎలాగైతే   టి.అర్.యస్ పార్టీ పెదన్న పాత్ర పోషించి ఉద్యమ సమయం లో అందరినీ కలుపుకొని పోయిందో , అదే స్పూర్తి తో ఎన్నారై. టి.అర్.యస్ వివిధ ప్రవాస తెలంగాణా సంస్థల తో పని చేసిన తీరుని వివరించారు. నేడు తెలంగాణా సంక్షేమమే ధ్యేయంగా ఎటువంటి బేషజాళాలకు పోకుండా ప్రతిపక్షాలను కలుపుకొని  తెలంగాణా మూక్యమంత్రి కెసిఆర్  గారు ముందుకు వెళ్తున్న తీరు యావత్ బారత దేశానికే ఆదర్శమని తెలిపారు.
ఎన్నారై. టి.అర్.యస్ ప్రతినిధులు స్వామి గౌడ్ గారిని ఘనంగా సన్మానించి, జ్ఞాపిక ను అందచేశారు.,  స్వామి గౌడ్ గారు వచ్చిన అతిథులని వ్యక్తిగతంగా వెళ్లి కలిసి సందడి చేసారు, వందన సమర్పణ తో కార్యక్రమాన్ని  ముగించారు.
కార్యక్రమంలో ఎన్నారై. టి.అర్.యస్  అద్యక్షులు అనిల్ కూర్మాచలం,  ఉపాద్యక్షులు మంద సునీల్ రెడ్డి, తెలంగాణా ఎన్నారై ఫోరం (TeNF) అద్యక్షులు సిక్క చంద్రశేకర్ గౌడ్, ప్రధాన  కార్యదర్శి దూసారి అశోక్ గౌడ్, సెక్రెటరీ  దొంతుల వెంకట్ రెడ్డి , యూకే & యురోప్ ఇన్‌ఛార్జ్  విక్రమ్ రెడ్డి,లండన్ ఇన్‌ఛార్జ్   రత్నాకర్ కడుడుల,  అధికార ప్రతినిథి  శ్రీకాంత్ జెల్ల. సెక్రెటరీ శ్రీధర్ రావు తక్కలపల్లి ,వెల్‌ఫేర్ ఇన్‌ఛార్జ్  వినయ్ కుమార్,మెంబర్‌షిప్ ఇన్‌ఛార్జ్  సతీష్ రెడ్డి బండ, ఈస్ట్ లండన్ ఇన్‌ఛార్జ్ ఆక్రం పాష , వెస్ట్ లండన్ ఇన్‌ఛార్జ్ లు మధుసుదన్ రెడ్డి మరియు రాజేష్ వర్మ  అలాగే తెలంగాణా ఎన్నారై ఫోరమ్ ప్రతినితులు ఉదయ్ నాగరాజు, ప్రమోద్ అంతటి, నగేష్ రెడ్డి, సుమా దేవి, శ్వేత రెడ్డి,స్వాతి బుడగం, సురేష్,జ్యోతి రెడ్డి తదితరులు  హాజరైన వారిలో ఉన్నారు.
Photo Gallery:

Leave a Comment