మీ వాకిట్లోనే చార్జింగ్ చెట్టు!

plastic treeమీ ఇంటివాకిట్లో ఉండే చెట్లు నీడను మాత్రమే ఇవ్వొచ్చు… కానీ, ఈ- చెట్టును పెట్టి చూడండి… మీ ఇంటికే కొత్తవెలుగు వస్తుంది.. వెలుతురునిచ్చే లైటర్‌గా, స్మార్ట్‌ఫోన్‌లకు చార్జర్‌గా పనిచేసే ఈ -చెట్టు మన కు ఎన్నోరకాలుగా ఉపయోగపడుతుంది. ప్లాస్టిక్‌తో తయారైన ఈ చెట్టుకు ఆకుల స్థానంలో సోలార్ ప్యానెల్‌లను అమర్చారు. ఇవి సూర్యరశ్మి నుంచి శక్తిని గ్రహించి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీనికి అమర్చిన యూఎస్‌బీ కేబుల్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లకు చార్జింగ్ పెట్టొచ్చు. అంతేకాదు వీటిలో తొమ్మిది సోలార్ సెల్స్ ఉన్నాయి. ఇవి కూడా చార్జింగ్ చేసుకొని ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు ఉపయోగించవచ్చు. ఫ్రెంచ్‌కు చెందిన ఎలక్ట్రానిక్ డిజైనర్ వివెన్ ముల్లర్ దీన్ని తయారు చేశాడు. బోన్సాయ్ మొక్కల స్ఫూర్తితో వీటిని రూపొందించినట్లు చెప్పాడు.

Leave a Comment