ముంబైలో టాటా గ్రూపు సంస్థల చైర్మన్‌ పైరస్‌మిస్ర్తీతోతెలంగాణ రాష్ట్రపంచాయితీరా జ్‌, ఐటిశాఖల మంత్రి కె.తారకరామా రావు ప్రత్యేకంగా భేటీ

తెలంగాణ  రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూ లమైన వాతావరణం ఉందని, పలు ప్రాజె క్టులను స్థాపించాలని, అలాగే బంగారు తెలంగాణ నిర్మాణంలో చేపట్టే పథకాలు, ప్రాజెక్టులలో భాగస్వామ్యం కావాలని కోరగా టాటా గ్రూపు సంస్థల సీఇఓలు సుముఖత వ్యక్తం చేసినట్లు మంత్రి కేటీ ఆర్‌ తెలిపారు.

చైర్మెన్‌ టాటా సన్స్‌ సైరస్‌ మిస్ర్తీతో 9 టాటా కంపెలకు చెందిన సీఇఓలతో పాటు సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. టాటా పవర్‌ నుంచి అనిల్‌ సర్ధాన, టాటా రియాల్టీ, ఇన్‌ఫ్రాస్ట్రర్‌ సంజయ్‌ఉబేలా, టాటా ప్రాజెక్ట్‌‌సకు చెందిన వినాయర్‌ దేశ్‌పాండే, టాటా కేపిటల్‌ పునీత్‌శర్మ, టాటా అడ్వాన్డ్‌ సిస్టమ్‌ సుకరన్‌సింగ్‌, సిఎంసీ ఆర్‌ రామనన్‌, టాటా హౌజింగ్‌ సుమిత్‌ సఫ్రూ, టాటా మోటార్స్‌ రవి, టాటా టెలి సర్వీస్‌ నుంచి ఎన్‌.శ్రీకాంత్‌ తదితరులతో పెట్టుబడులపై సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వాటర్‌గ్రిడ్‌, టి.హబ్‌, ఇండస్ట్రీయల్‌ కారీడార్‌, స్మార్ట్‌సిటీ, సోలాల్‌పార్కు, ఏయిర్‌స్పెస్‌పార్కు, నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం, హైదరాబాద్‌ నగరంలో మౌలిక వసతుల మెరుగు తదితర పథకాలు, ప్రాజెక్టులపై మంత్రి కేటీఆర్‌   వివరించారు.

Leave a Comment