ముద్దుల పోరాటాన్ని అడ్డుకోము…. హోం మంత్రి స్పష్టం

ప్రజాస్వామ్య దేశమైన మన భారత దేశంలో ఎవరు ఎవరినైనా ఎక్కడైనా ముద్దు పెట్టుకోవచ్చును, ఎవరైనా ఎక్కడైనా ఆందోళనలు చేయవచ్చును అందుకు వారికి 1400675072-3799సంపూర్ణ హక్కు ఉందని, దానిని తమ ప్రభుత్వం అడ్డుకోదని కేరళ రాష్ట్ర హోం శాఖ మంత్రి రమేష్ చెన్నితల స్పష్టం చేశారు.
ఈ అంశంపై ఆయన సోమవారం అసెంబ్లీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ… ముద్దులు పెట్టుకోవడం… పోరాటాలు చేయడం వంటి వాటికి మన దేశంలో సంపూర్ణ స్వేచ్చగలదని అన్నారు. శాంతిభద్రతల సమస్య చోటు చేసుకుంటే మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని, అదే సమయంలో ముద్దుల పోరాటాన్ని అడ్డుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆయన తేల్చి చెప్పారు.
కాగా కేరళ హోటల్లో బహిరంగంగా ముద్దులు పెట్టుకుంటూ, డ్యాన్స్ చేస్తున్న కళాశాల విద్యార్థులను అడ్డుకున్న భారతీయ జనతా యువ మోర్చ సంస్థకు వ్యతిరేకంగా కొచ్చిలో ప్రారంభించిన ఈ ముద్దుల పోరాటం, పొరుగు రాష్ట్రం అయిన తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా వ్యాపిస్తోంది.
ఈ స్థతి కోడికోడ్ బస్టాండు వద్ద ముద్దుల పోరాటం చేయడానికి సిద్ధమైన కిస్ ఆఫ్ లవ్, అనుమన్ సేన సంఘాలకు చెందిన వారిని అదుపులోకి తీసుకున్నట్టు నగర పోలీసు కమిషనర్ జార్జ్ తెలిపారు.

Leave a Comment