మోడల్ చేతుల మీదుగా.. !

FIFA-2014బ్రెజిలియా: సాధారణంగా ప్రపంచకప్ ఫుట్‌బాల్ విజేతలకు ఫిఫా అధ్యక్షుడో లేక ఆతిథ్య దేశ అధ్యక్షుడో ట్రోఫీని ప్రదానం చేస్తారు. కానీ ఈసారి బ్రెజిల్‌లో మాత్రం ప్రముఖ మోడల్ గిసెలి విజేతలకు కప్ అందిస్తుందట..! దేశం ఇబ్బందుల్లో ఉంటే భారీగా ఖర్చు చేసి టోర్నీని నిర్వహిస్తున్నారంటూ బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మాపై ఇప్పటికే విమర్శలు ఉన్నాయి.
 
  మరోవైపు ఫిఫా అధ్యక్షుడు బ్లాటర్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ ట్రోఫీని ప్రదానం చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ బ్రెజిల్ ప్రపంచకప్ గెలిస్తే మాత్రం దిల్మానే ట్రోఫీ ఇస్తారు. వేరే జట్టు గెలిస్తే గిసెలికి అదృష్టం దక్కుతుంది.

Leave a Comment