మోడీపై పాక్ మీడియా ప్రశంసల వర్షం…..

ఐక్యరాజ్య సమితిలో ప్రధాని నరేంద్ర మోడి ప్రసంగంపై పాకిస్థాన్ పత్రిక డైలీ టైమ్స్ ప్రశంసల వర్షం కురిపించింది. మోడీ ప్రసంగం ముందు పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రసంగం వెలవెలబోయిందని పేర్కొంది. మోడీ ఎట్ ద యూఎన్ పేరిట సంపాదకీయం రాసింది. మోడీ ఐరాసలో ప్రసంగం ద్వారా పాశ్చాత్య దేశాల్లో తన హవాను మరింత దూకుడుగా కొనసాగించారని అభిప్రాయపడింది. ఆకట్టుకోవడంలో మోడీదే పైచేయిగా కనిపించిందని,షరీఫ్ ఆ విషయంలో విఫలమయ్యారని విమర్శించింది.  వేదకాలం నాటి విషయాలను స్పృశిస్తూ వేద సంస్కృతిని ప్రతిబింబించేలా మోడీ ఉపన్యాసం సాగించారని డైలీ టైమ్స్  పేర్కొంది. వాడివేడి చర్చలకు ఐక్యరాజ్య సమితి వేదిక కాదన్న విషయం గుర్తెరిగిన మోడీ, భారత్ ప్రతిష్ఠతో పాటు తన వ్యక్తిగత ప్రతిష్ఠను పెంచుకునే విధంగానే మాట్లాడారని కొనియాడింది. కానీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మాత్రం సీరియస్ అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించారని డైలీ టైమ్స్ విమర్శించింది.

Leave a Comment