మోడీ ఉరితీసే తలారి:లాలూ ప్రసాద్

Lalu_Prasad_Yadavపాట్నా: బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీపై ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గోద్రా అల్లర్లకు కారణమైన మోడీని చూస్తే కసాయి కూడా సిగ్గుతో తలదించుకుంటాడని నిన్న వ్యాఖ్యానించిన లాలూ ఈ రోజు మోడీ ఉరితీసే తలారి అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. పాట్నా విమానాశ్రయంలో లాలూ ఈరోజు విలేకరులతో మాట్లాడారు. ‘‘మోడీ ఓ తలారి. ఆయన ఎక్కడి నుంచి వచ్చినా, ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఇది మాత్రం మారదు’’ అని అన్నారు. లోక్‌జన శక్తి పార్టీ అధినేత రాంవిలాస్ పాశ్వన్ లాంటి వారు మోడీ వెంట వెళ్లడం తనకు బాధకలిగించిందన్నారు. ఒక ముస్లింను బీహార్‌కు ముఖ్యమంత్రిని చేస్తానన్న పాశ్వన్ తలారి మోడీతో వెళ్లారని చెప్పారు.

Leave a Comment