మ్యాచ్ కాకముందే గెలిచిందని అమెరికా ఎంబసీ కంగ్రాట్స్

ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య బుధవారం మ్యాచ్ జరుగుతోంది. ఈ సమయంలో కాబూల్‌లో అమెరికన్ ఎంబసీ ట్విట్టర్లో.. ఆప్ఘనిస్తాన్ జట్టు గెలిచిందని ట్వీట్ చేసింది. మ్యాచ్ పూర్తికాకముందే ఆప్ఘన్ జట్టు గెలిచిందని అభినందనలు తెలిపింది.

దీంతో ఆప్ఘనిస్తాన్ క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోయారు. అమెరికన్ ఎంబసీ తీరు మీడియా ద్వారా అందరికి పాకిపోయింది. దీంతో అమెరికన్ ఎంబసీ నాలుక్కర్చుకుంది. ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్ జట్టు పైన గెలిచినందుకు ఆప్ఘనిస్తాన్‌కు కంగ్రాచ్యులేషన్ అని తొలి ట్వీట్ చేసింది. తప్పుదిద్దుకొని మరో ట్వీట్ చేసింది. తాము ముందే ట్వీట్ చేశామని చెబుతూ… ఇప్పటికీ తాము ఆప్ఘనిస్తాన్ గెలవాలని కోరుకుంటున్నట్లు మరో ట్వీట్ చేసింది.

Leave a Comment