యువ హీరో పెళ్లి కుదిరింది

సాయికుమార్ త‌న‌యుడు ఆది పెళ్లి కుదిరింది. ఇటీవ‌ల రాజ‌మండ్రికి చెందిన అరుణ‌తో ఆది నిశ్చితార్థం జ‌రిగింది. ఇప్పుడు పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స‌య్యింది. డిసెంబ‌రు 13న హైద‌రాబాద్‌లో ఆది – అరుణ‌ల వివాహాన్ని వైభ‌వంగా చేయాల‌ని సాయికుమార్ కుటుంబ స‌భ్యులు నిర్ణ‌యించారు. ”ఆది త్వ‌ర‌లోనే ఏడో సినిమా చేయ‌బోతున్నాడు. అంత‌లోనే ఏడ‌డుగులు వేస్తున్నాడు. తాను పుట్టింది శ్రీ‌కాకుళంలో. పెరిగింది చెన్న‌ప‌ట్నంలో, ఉంటోంది హైద‌రాబాద్‌లో, రాజమండ్రికి అల్లుడు కాబోతున్నాడు. నా బిడ్డ‌కు మీ అంద‌రి ఆశీర్వాదాలూ కావాలి” అంటున్నారు సాయికుమార్‌. ఆది న‌టించిన ర‌ఫ్ త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది.

Leave a Comment