రజత్ గుప్తాకు అమెరికా కోర్టులో చుక్కెదురు

Guptaన్యూయార్క్: ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులో జైలుకి వెళ్లకుండా గోల్డ్‌మన్ శాక్స్ మాజీ డెరైక్టర్ రజత్ గుప్తా చేసిన ఆఖరు ప్రయత్నం విఫలం అయ్యింది. బెయిల్‌ను కొనసాగించాలంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని అమెరికా సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఈ నెల 17న గుప్తా కారాగారానికి వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. న్యూయార్క్ నగరానికి 112 కిలోమీటర్ల దూరంలోని ఒటిస్‌విల్‌లో మధ్య స్థాయి భద్రత ఉండే కారాగారంలో గుప్తాను ఉంచనున్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులో రజత్ గుప్తాకు రెండేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. 

Leave a Comment