రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిది..

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకూడదని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేవీకేఎస్ ఇళంగోవన్  అభిప్రాయపడ్డారు. రజనీకాంత్‌ను చేర్చుకునేందుకు బీజేపీతోపాటు ఇటీవల కాంగ్రెస్‌ నుంచి తప్పుకున్న జీకే వాసన్ కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పారు.  అయితే ఆయన రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిదన్న అభిప్రాయాన్ని ఇళంగోవన్ వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలలో ఆయన అభిమానులు ఉన్నారన్నారు.  ఆయన ఏ పార్టీలో చేరినా మిగిలిన పార్టీలోని అభిమానులు బాధకు గురి కావాల్సివస్తుందన్నారు. తమిళనాడు ప్రజలంతా ఆయన్ను గౌరవిస్తారని చెప్పారు. అయితే, రజనీకాంత్ తోపాటు లౌకిక వాదానికి కట్టుబడిన పౌరులెవరైనా కాంగ్రెస్‌లో చేరితే తాము స్వాగతిస్తామని ఇళంగోవన్ అన్నారు.

Leave a Comment