రజినీకాంత్ రికార్డు !

టాప్ హీరోలందరూ తాము నటించే సినిమాలలోని తమ పాత్రలకు డబ్బింగ్ చెప్పడానికి కనీసం మూడు నుంచి పది రోజుల వరకు సమయం తీసుకుంటూ ఉంటారు. పెదాల కదలికకు చెపుతున్న డైలాగ్ కు సంబంధం లేకుండా డబ్బింగ్ చెపితే ప్రేక్షకులు అసహనానికి లోనై తాము డబ్బింగ్ సినిమాకు వచ్చామా అనే భావనలోకి వెళ్ళిపోతారు.  రజినీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘లింగా’ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ఈ మధ్యనే ప్రారంభo అయ్యాయి. అయితే ఈ సినిమాలోని రజినీ పాత్రకు సూపర్ స్టార్ రజినీకాంత్ తన డబ్బింగ్ ను ఒకే ఒక్క రోజులో పూర్తి చేయడం కోలీవుడ్ సినిమా రంగంలో షాకింగ్ గా మారింది.  హీరో పాత్రకు ఎక్కువ డైలాగ్స్ ఉండటమే కాకుండా పవర్ ఫుల్ డైలాగ్స్ తో పాటు పంచ్ డైలాగ్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా రజినీ సినిమాలలో అయితే ఈ డైలాగ్స్ పాత్ర మరీ ఎక్కువగా ఉంటుంది. అటువంటి పవర్ ఫుల్ సీన్స్ ఉన్న ‘లింగా’ లోని తన పాత్రకు రజినీ చకచకా ఒకే రోజులో డబ్బింగ్ పూర్తి చేసిన విషయాన్ని తెలుసుకున్న సినిమా రంగ ప్రముఖులు ఆరు పదుల వయస్సు దాటినా స్పీడ్ తగ్గని రజినీకాంత్ టాలెంట్ ను పొగుడుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు.  ఈ వార్తలు ఇలా ఉండగా మొన్న బెయిల్ పొంది విడుదల అయిన జయలలితకు భవిష్యత్తులో ఆమెకు మంచి జరగాలని కోరుకుంటూ రజినీకాంత్ పంపిన ఉత్తరంను బట్టి రజినీకాంత్ రాజకీయాలలోకి రావడానికి ఇంకా మానసికంగా సిద్దం కాలేదు అనే సంకేతాలను ఇస్తోంది. అయినా అధికారంతో సంబంధం లేకుండా తమిళ ప్రజలకు రజినీ ఎప్పుడూ దేవుడే…

Leave a Comment