రాంచి ‘రేస్’ లో ధోని

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ హాకీ లీగ్ లోకి ప్రవేశించారు. తన సొంత నగరమైన రాంచి పేరుమీద రాంచి రేస్ తో ఇండియన్ హాకీ లీగ్ జట్టును కొనుగోలు చేశారు. ఇప్పటికే ధోని మోటార్ స్పోర్ట్స్ లో మహీ రేసింగ్ ను, ఐఎస్ఎల్ లీగ్ లో చెన్నైయాన్ జట్టును కొనుగోలు చేసిన విషయం తెలిసింది. కాగ.. ఇప్పుడు ధోని ఇప్పుడు హాకీ జట్టును కొనుగోలు చేసి..దేశంలో హాకీ అభివృద్దికి నడుంబిగించారు. “క్రికెట్ ఆడటం నా తొలి ప్రాధాన్యత. ఒక క్రీడాకారుడిగా క్రీడలను ప్రోత్సహించాల్సిన బాధ్యత నాపై ఉంది. రాంచిలో పుట్టి పెరిగాను. అందుకే మరో ఆలోచన చేయకుండా రాంచి రేస్ పేరుతో జట్టును కొనుగోలు చేశాను. నా ప్రధాన లక్ష్యం హాకీ అభివృద్ది. మూలాల నుంచి ఆటను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. హాకీ నైపుణ్యాన్ని వెలికితీసేందుకు రాంచి రేస్ కృషి చేస్తుంది” అని ధోని చెప్పాడు. ఇప్పుడిప్పుడే దేశంలో ఫుట్ బాల్ కు ఆదరణ లభిస్తున్నది. మన జాతీయ క్రీడ హాకీకి కూడా ఇకపై మంచి రోజులు వచ్చినట్టే.

Leave a Comment