రాజ్నాథ్కు హోం శాఖ… వెంకయ్యకు రైల్వే శాఖ

venkaya

 

న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కేంద్ర మంత్రుల ఎంపికపై బీజేపీ కసరత్తు పూర్తి అయింది. కేంద్ర మంత్రి పదవులు వరించనున్న వారి వివరాలను ఆ పార్టీ శుక్రవారం న్యూఢిల్లీలో విడుదల చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్కు కేంద్ర హోం శాఖ బాధ్యతులు అప్పగించనున్నారు. లోక్సభ స్పీకర్గా మురళీ మనోహర్ జోషీని  ఎంపిక చేశారు. అలాగే ఎన్డీఏ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీని నియమించారు.
 

 

కేంద్ర మంత్రుల వివరాలు:

ఆర్థిక శాఖ – సుబ్రహ్మణ్య స్వామి
విదేశీ వ్యవహారాల శాఖ – అరుణ్ జైట్లీ
రక్షణ శాఖ – సుష్మా స్వరాజ్
రైల్వే శాఖ – వెంకయ్య నాయుడు
పట్టణాభివృద్ధి శాఖ – నితిన్ గడ్కరీ
వ్యవసాయ శాఖ – గోపినాథ్ ముండే
గ్రామీణాభివృద్ధి శాఖ – ఆనంత గీతే
ఆరోగ్య శాఖ – హర్షవర్థన్
న్యాయ శాఖ – రవిశంకర్ ప్రసాద్
వాణిజ్య శాఖ – ఎస్ ఎస్ అహ్లూవాలియా
టెలికాం శాఖ- అనంత కుమార్
బొగ్గు శాఖ  – హన్స్రాజ్ అహిర్
పెట్రోలియం శాఖ – రామ్ విలాస్ పాశ్వాన్
భారీ పరిశ్రమల శాఖ – ఆనంద్ రావు అడ్సులు
పౌర విమానయాన శాఖ – షానవాజ్  హుస్సేన్
మైనారిటీ శాఖ – ముక్తార్ అబ్బాస్ నక్వీ
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ – సులన్ మిత్ర మహాజన్
మహిళ మరియు శిశు సంక్షేమం – అను ప్రియా పాటెల్
మానవ వనరులు అభివృద్ధి శాఖ – బీఎస్ యాడ్డ్యురప్ప
నీటి వనరుల శాఖ – పురుషోత్తం రుపాలా
క్రీడ శాఖ – కిర్తీ ఆజాద్
పర్యాటక శాఖ – శ్రీపాద్ నాయక్
సాంస్కతిక శాఖ – మీనాక్షి లేఖి
సమాచారా శాఖ – జగదాంబికా పాల్
కార్పొరేట్ వ్యవహారాల శాఖ – అనురాగ్ ఠాకూర్క
సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ – బీసి ఖండూరీ
ప్రవాసీ భారతీయ వ్యవహారాలు (ఎన్నారై శాఖ )- రాజీవ్ ప్రతాప్ రూడీ
సామాజిక న్యాయం – బండారు దత్తాత్రేయ

సహాయ మంత్రులు :
హోం శాఖ – సత్యపాత్ సింగ్
రక్షణ – వీకే సింగ్
వ్యవసాయం – రాజు శెట్టి
సామాజిక న్యాయం – రామదాస్ అతవాలే
న్యాయశాఖ – కీరిటీ సోమయ్య
క్రీడ శాఖ రాజ్యవర్థన్ రాధోడ్

తొమ్మిది దశలలో జరిగిన దేశ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా 543 స్థానాలకు గాను బీజేపీ 282 స్థానాలలో విజయ ఢంకా మోగించింది. ఎన్టీఏ భాగస్వామ్య పక్షాలు ( 29 పార్టీలు) మొత్తం 336 స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిందే. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం విదితమే.

Leave a Comment