రామ్ చరణ్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్

మెగా హీరో రామ్ చరణ్ మరో యంగ్ డైరెక్టర్ కి డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే లక్ష్యం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన డైరెక్టర్ శ్రీవాస్ తన చివరి సినిమా ‘లౌక్యం’తో సూపర్ హిట్ అందుకున్నాడు. లౌక్యం మూవీ కథనం పాతదే అయినా, దానికి కమర్షియల్ హంగులు, బేసిక్ ఫార్ములా వంటివి పాటించి బాక్సాపీస్ వద్ద మినిమం ఎంటర్టైనర్ మూవీగా చూపించాడు. దీంతో లౌక్యం మూవీకి మినిమం కలెక్షన్స్ తో లాభాల బాట పట్టింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం శ్రీ వాస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని డైరెక్ట్ చేయనున్నాడని అంటున్నారు. గత కొంత కాలంగా కోన వెంకట్, గోపి మోహన్ కలిసి రామ్ చరణ్ కి చెప్పిన కథకి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ కథకి డైరెక్టర్ ఎవరు అన్నదానిపై ఇంకా కసరత్తులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు డైరెక్టర్ విషయంలో మేటర్ ఓ కొలిక్కి వచ్చిందనే టాక్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు, కోన వెంకట్, గోపి మోహన్ ల కథని డైరెక్ట్ చేసే అవకాసం శ్రీవాస్ ని వరించినట్లు సమాచారం. శ్రీవాస్ కి కోన వెంకట్, గోపి మోహన్ లతో మంచి రిలేషన్ ఉంది. శ్రీవాస్ డైరెక్ట్ చేసిన ‘పాండవులు పాండవులు తుమ్మెద’, ‘లౌక్యం’ సినిమాలకి వీరు పనిచేసారు. దాంతో వీరి రిలేషన్ షిప్ మరింత పెరిగింది. రామ్ చరణ్ కూడ శ్రీవాస్ డైరెక్షన్ వైపు ఆసక్తి చూపుతున్నట్టు మెగా కాంపౌండ్ ని వినిపిస్తున్న సమాచారం.

Leave a Comment