కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నందున ఇక్కడ కూడా తమ ప్రభుత్వం రావాలని హర్యానా ప్రజలు కోరుకున్నారని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. హర్యానా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని ,రాష్ట్ర పురోభివృద్ధికి కేంద్రం అన్నివిధాలా సహకరిస్తుందని హామీయిచ్చారు. తమ పార్టీకి పూర్తి మెజార్టీ కట్టబెట్టిన హర్యానా ప్రజలకు వెంకయ్య కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం జరిగిన హర్యానా బీజేపీ ఎమ్మెల్యేల సమావేశానికి కేంద్ర పరిశీలకుడిగా ఆయన హాజరయ్యారు.
Recent Comments