రికార్డుల ‘ముడి’ విప్పుతుంది..

Diamondచూడ్డానికి గాజు ముక్కలా కనిపిస్తోంది గానీ.. ఇది మన జేబులో ఉంటే రూ.600 కోట్లు మనదైనట్లే.. ఎందుకంటే గాజుముక్కలా కనిపిస్తున్న ఇది సానబెట్టని ముడి వజ్రం. దక్షిణాఫ్రికాలోని కల్లినాన్ గనుల్లో దొరికింది. స్ట్రాబెర్రీ సైజులో ఉండే 122.5 క్యారెట్ల ఈ నీలి వజ్రం.. ముడి వజ్రాలలో అత్యంత ఖరీదైనదిగా భావిస్తున్నారు. ఎందుకంటే.. గతంలో అత్యంత ఖరీదైన  ముడి వజ్రం(507 క్యారెట్ల వైట్ డైమండ్) రూ. 201 కోట్లకు అమ్ముడుపోయింది. ఇది మాత్రం కనీసం రూ. 600 కోట్లు పలుకుతుందని.. గత రికార్డులను బద్దలుకొడుతుందని నిపుణులు చెబుతున్నారు. త్వరలో జొహన్నెస్ బర్గ్‌లో జరిగే ప్రైవేటు టెండర్ ప్రక్రియలో దీన్ని వేలం వేస్తారు.

Leave a Comment