‘రుణమాఫీపై చంద్రబాబుకు భయం పట్టుకుంది’

71400837244_625x300అనంతపురం : ఎన్నికల నేపథ్యంలో రుణమాఫీ చేస్తామంటూ రైతులకు ఇచ్చిన హామీకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉండాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం అనంతపురంలో రఘువీరారెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రుణమాఫీ వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని చంద్రబాబుకు భయం పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్లో రుణమాఫీ చేయాలంటే రూ. 80 వేల కోట్లు అవసరమవుతాయని రఘువీరారెడ్డి గుర్తు చేశారు.

ఓ వైపు కరీఫ్ సీజన్ ప్రారంభమైందని… రుణ మాఫీ దృష్ట్యా రైతులు రుణాలు కట్టలేదు… కొత్త రుణాలు కావాలాంటే పాత రుణాలు కట్టాలని ఆయన వివరించారు. రుణమాఫీ అంశంపై రిజర్వు బ్యాంక్ ఉన్నతాధికారులు ఇప్పటి వరకు ఆర్థిక నిపుణులతో చర్చించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాతే చంద్రబాబు రుణమాఫీ హామీ ఇచ్చారన్న సంగతి రఘువీరారెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. చంద్రబాబు ప్రకటనల్లో స్పష్టత లేదని రఘువీరారెడ్డి విమర్శించారు. ఒకే సారి రూ. 80 వేల కోట్ల రుణం మాఫీ చేయాలంటే చంద్రబాబు కాళ్లలో వణుకుపుడుతుందంటూ రఘువీరా చమత్కరించారు.
 
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత తొలి సంతకం రుణమాఫీపై చేస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. రాష్టం ఏర్పడే వరకు రెచ్చగొట్టిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇప్పుడు సీఎం హోదాకు తగినట్లు మాట్లాడాలని రఘవీరా హితవు పలికారు.ఉద్యోగులపై కేసీఆర్ వ్యాఖ్యలు హైదరాబాద్కే నష్టమన్నారు. ఉద్యోగులందరికి రక్షణ కవచంలా ఉంటామని రఘువీరా రెడ్డి ఈ సందర్బం సీమాంధ్ర ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. 

Leave a Comment