రుద్రమదేవిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్!

allu arjun in rudrama deviచెన్నై : ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం రుద్రమదేవి. ఆ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అతిథి పాత్ర చేయనున్నారా ?… అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. అలాగే సామాజిక వెబ్ సైట్లు, ట్విట్టర్లలో ఆ వార్త హాల్చల్ చేస్తుంది. రుద్రమదేవి చిత్రంలోని ప్రముఖ పాత్రలలోని ఓ పాత్రలో ఒదిగిపోయే నటుడి కోసం దర్శకుడు గుణశేఖర్ తీవ్రంగా అన్వేషిస్తున్నాడు. ఆ క్రమంలో కొందరు ప్రముఖ నటులను గుణశేఖర్ ఎంపిక చేశాడు కూడా.
 
అయితే ఆ పాత్రను తాము చేయలేమంటూ ఎంపికైన వారు ఒకొక్కరుగా తప్పుకుంటున్నారు. దాంతో ఆ ప్రాతకు న్యాయం చేసే నటుడి ఎంపికను గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఆ క్రమంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఆ పాత్రలో అర్జున్ అయితే సరిగ్గా సరిపోతాడని గుణశేఖర్ భావించినట్లు సమాచారం. అందుకోసం సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం.

రుద్రమదేవి చిత్రంలో అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తుండగా, రానా దగ్గుబాటి, కృష్ణంరాజు, ప్రకాష్ రాజు, బాబా సెహగల్, ఆదిత్య మీనన్, నిత్య మీనన్, హాంసానందిని, క్యాథరిన్ థెరిసా, అదితి చెంగప్ప ప్రముఖ ప్రాతలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Comment